Saturday, November 16, 2024

కెఎల్ వర్సిటీపై అంత ప్రేమెందుకో?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: విధి నిర్వహణలో ని క్కచ్చిగా ఉంటూ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవె న్యూ అధికారులు కాసుల వేటలో పడి ప్రైవేటు యూనివర్సిటీకి బానిసలు అయ్యారు. కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూమి కళ్ళముందు కబ్జా జరిగిన చ ర్యలు తీసుకోకుండా భూమి వారికి కేటాయించాలంటూ పై అధికారులకు నివేదికలు పంపుతూ కంచే చేను మేసిందన్న చందంగా తయారయ్యారు కొంతమంది కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం సర్వేనెంబర్ 353 లో ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలం కేఎల్ యూనివర్సిటీ ఆధీనంలో ఉంది. ఈ భూమిని తమకు కేటాయించాలంటూ యూనివర్సిటీ నిర్వాహకులు రె వెన్యూ అధికారులకు, కోర్టు ద్వారా నివేదించుకున్నా రు. ఈ భూమిని పరిశీలించి ఇది ప్రభుత్వ భూమి నిబంధన ప్రకారం కుదరదంటూ నివేదిక వెనక్కి పంపాల్సిన అధికారులు కాసుల మత్తులో పడి కళ్ళు మూసుకున్నా రు.ఈ భూమిలో గత కొంతకాలంగా కేఎల్ యూనివర్సిటీ వారే ఉన్నారు వారికి ఇవ్వచ్చంటూ నివేదికను త యారు చేసి పై అధికారులకు పంపారు. ఇదంతా గుట్టు చప్పుడు కాకుండానే జరిగినా పై అధికారి ఫైల్ వెనక్కి పంపడంతో అమ్ముడుపోయిన అధికారుల బాగోతం బయటపడింది.

కుత్బుల్లాపూర్ మండల పరిధి గాజులరామారంలో కేఎల్ యూనివర్సిటీ భవన నిర్మాణం కో సం టీఎస్పీ బిపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత సర్వే నెంబర్లు రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉండడంతో ఈ భూమి ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ భూమా నివేదించాలంటూజిహెచ్‌ఎంసి అధికారులు రెవెన్యూ అధికారులను లిఖితపూర్వకంగా వివరణ కోరారు. దీంతో మల్కాజ్గిరి ఆర్‌డిఓ కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులను నివేదిక పంపాల్సిందిగా కోరారు. అప్పటికే అమ్యామ్యాలను అందుకున్న కొంతమంది అవినీతి అధికారులు నివేదికలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌గా కొంత చూపుతో ఈ భూమి బదులు మరో భూమి ఇస్తారంటూ దరఖాస్తు చేసుకున్నారని వారి వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ నివేదికను పై అధికారులకు పంపారు.ఈ నివేదికను చూసి నివ్వెరపోయిన రెవెన్యూ ఉన్నతాధికారి చట్ట విరుద్ధమంటూ కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులకు మొట్టికాయలు వేసి ఫైల్ ను వెనక్కి పంపాడు. ఈ విషయం ఈ నోటా ఆ నోట బయటపడడంతో పత్రికల్లో కథనాలు రావడంతో వెనక్కు తగ్గిన సదరు అధికారి భూమి ఎక్స్చేంజ్ ఆఫర్ ఫైల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.

కేఎల్‌పై చర్యలు ఉండవా?
కుత్బుల్లాపూర్ లో అక్రమాన్ని సక్రమంగా చేసేందుకు రెవెన్యూ అధికారులు పావులు కదుపుతున్నారు. 60 గజాల్లో పేదోడు గు డిసె వేస్తే హుటాహుటిన వచ్చి ఇది ప్రభుత్వ స్థలం అంటూ చేపట్టే రెవెన్యూ అధికారులు సంపన్నులు 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే మాత్రం కళ్ళు మూసుకున్నారని విపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. సామాన్యులకోచట్టం సంపన్నులకు ఓ చట్టమా అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీకి ఆధీనంలో ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ని కాపాడి ప్రజల వినియోగానికి ఉపయోగించాలని విద్యార్థి సం ఘాల నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన కేంద్ర యూనివర్సిటీ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ల్యాండ్ గ్రామర్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని పార్టీలో నాయకులు, సామాజిక వేత్తలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News