Monday, December 23, 2024

చండీగఢ్‌లో 36 గంటలుగా కరెంట్ కట్

- Advertisement -
- Advertisement -
36 hour power cut in Chandigarh
విద్యుత్ సిబ్బంది సమ్మె ప్రభావం

చండీగఢ్ : చండీగఢ్‌లో విద్యుత్ సిబ్బంది సమ్మెకు దిగడంతో చాలా ప్రాంతాల్లో గత 36 గంటలుగా కరెంట్ సరఫరా నిల్చిపోయింది. నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ లైట్లు వెలగడం లేదు. ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు వాయిదా పడుతున్నాయి. విద్యుత్ విభాగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చండీగఢ్ ప్రభుత్వం నిర్ణయించడంతో దీనిని నిరసిస్తూ విద్యుత్ విభాగ సిబ్బంది సమ్మె చేపట్టారు. అధికారుల చర్చలు ఫలించలేదు. దీంతో సోమవారం అర్థరాత్రి నుంచి సిబ్బంది సమ్మె ప్రారంభించారు. అనేక గ్రామాల్లో వేలాది ఇళ్లకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఆన్‌లైన్ క్లాసులు నిలిచి పోయాయి. కోచింగ్ సంస్థలు మూతపడ్డాయి. ఆస్పత్రులను జనరేటర్లతో నడిపిస్తున్నారు. ఫోన్లలో ఛార్జింగ్ కూడా లేక చాలామంది చార్జింగ్ కోసం పొరుగు నగరాల్లో తమ బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. పక్కనే ఉన్న మోహలీ, జిరాక్‌పుర్, పంచకుల ప్రాంతాల్లో చండీగఢ్ వాసుల తాకిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News