Monday, January 20, 2025

లోయలో పడ్డ బస్సు..

- Advertisement -
- Advertisement -

దోడా : జమ్మూ కశ్మీర్‌లో ఓ బస్సు లోయలో పడి 36 మంది దుర్మరణం చెందారు. 19 మంది గాయపడ్డారు. ఈ సంఘటన దోడా జిల్లాలో బటోటే కిష్టావర్ జాతీయ రహదారిపై త్రుంగల్ అస్సార్ వద్ద బుధవారం జరిగింది. బస్సు నెంబరు జెకె 02 సిఎన్ 6555 దాదాపు 55 మంది ప్రయాణికులతో వెళ్లుతుండగా రహదారిపై అదుపు తప్పి పక్కనే ఉన్న 300 అడుగుల లోతైన లోయలో పడింది. సమాచారం అందుకుని సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. కొన్ని మృతదేహాలను వెలికితీశారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. ఘటనపై జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ ఎంపి, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం అని, 36 మంది వరకూ చనిపోవడం,

గాయపడ్డ వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియడంతో తాను వెంటనే అధికారులను అప్రమత్తం చేశానని వివరించారు. జిల్లా కలెక్టరు నుంచి సమాచారం తీసుకుంటున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం అందుతుందని వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని మోడీ, అమిత్ షా వేర్వేరు ప్రకటనలు వెలువరించారు. మృతుల కుటుంబాలకు తలో రూ 2 లక్షల తక్షణ సాయం ప్రకటిస్తూ మోడీ , గాయపడ్డ వారికి రూ 50,000 సాయం ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి అందిస్తున్నట్లు తెలిపారు. గవర్నర్ మనోజ్ సిన్హా వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.. తగు సహాయక చర్యలకు ఆదేశాలు వెలువరించారు. బస్సు ఉదయం పూట వెళ్లుతున్నందున దట్టమైన పొగమంచు కారణంతో అదుపు తప్పి ఉంటుందని ప్రాధమిక సమాచారం వల్ల వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News