Monday, December 23, 2024

కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

లిమా: కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి చెందిన సంఘటన దక్షిణ పెరూలో జరిగింది. గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీగా బురద వరద నది ప్రవాహంలాగా ప్రవహిస్తుంది. బురదతో కూడిన వరదలో వందిలాది ఇండ్లు మునిగిపోయాయి. బూరదలాంటి వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. గల్లంతైన వారి సంఖ్య పదులలో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కొందరు బురదలో కొట్టుకొనిపోతుండగా స్థానికులు రక్షించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గత వారం రోజుల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో గుట్టలపై ఉన్న బురద కొట్టుకవస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News