- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు స్టేషన్ల మధ్య నడుస్తున్న 36 సర్వీసులను సోమవారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం 79 సర్వీసులకు 36 సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది. రైల్వే ట్రాక్ నిర్వహణ పనులు కొనసాగుతుండడంతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్ మీదుగా నడిచే తొమ్మిది సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి మీదుగా నడిచే 9 సర్వీసులు, ఫలక్‌నామా-లింగంపల్లి మీదుగా నడిచే 8 సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది. అలాగే లింగంపల్లి-ఫలక్‌నామా మీదుగా నడిచే 8 సర్వీసులు, సికింద్రాబాద్- లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ మీదుగా నడిచే రెండు సర్వీసులను రద్దు చేశారు. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
36 MMTS Rail Services to cancelled on Jan 17
- Advertisement -