- Advertisement -
లిమా: పెరూలో ఎడతెగని భారీ వర్షాలు జల ప్రళయాన్ని సృష్టించాయి. కుండపోత వర్షాలతో 36మంది మృత్యువాత పడ్డారని అధికారులు సోమవారం తెలిపారు. పౌర రక్షణ అధికారి గుటెర్రెజ్ తెలిపిన సమాచారం ప్రకారం ప్రావిన్సులో 36 మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని స్థానిక రేడియో ఆర్‌పిపి తెలిపింది.
చనిపోయినవారిలో ఐదుగురు ఓ వాహనం వాగులోని బురదనీటిలో చిక్కుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ప్రధాన రహదారిపై మూడు కిలోమీటర్లు మేరకు పేరుకుపోయిన శిథిలాలను తొలగించేందుకు భారీ యంత్రాలను పంపాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఎడతెగని భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో 630 ఇళ్లు దెబ్బతిన్నాయని, వంతెనలు, పంటకాలువలు, రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -