Friday, January 24, 2025

ఫుడ్ పాయిజన్ తో 36 మంది విద్యార్థులకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : ఫుడ్ ఫాయిజన్ అయ్యి 36 మంది బాలికలు అస్వస్థతకు గురైన సంఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం టామాట కూరతో భోజనం చేసిన అనంతరం కొందరు అస్వస్థతకు గురైయ్యారు. దీంతో రాత్రి నుంచి పాఠశాలలోని కొందరు బాలికలు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురైయ్యారు. వారికి స్థానికంగానే ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు. గురువారం ఉదయానికి అస్వస్థతకు గురైన వారి సంఖ్య 36కు చేరుకోవడంతో వారికి మెరుగైన చికిత్స కోసం పాఠశాల అధికారులు హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు.

దీంతో విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు, అధికారులు ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినీల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనారోగ్యానికి గురైన తమ పిల్లలు ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పిల్లల తల్లితండ్రులు ఆందోళనకు గురైయ్యారు. వారు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకుని వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు బాలికలు కోలుకుంటున్నారని ఎలాంటి ఇబ్బందులు ఏవీ లేవని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆస్పత్రికి చేరుకుని ఎంపీ, ఎమ్మెల్యేలు బాలికలకు పరామార్శ..
ఆస్పత్రి పాలు అయిన కస్తూరిబా పాఠశాల బాలికల ఆరోగ్యపరిస్థితులు తెలుసుకునేందుకు గురువారం ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌లు వేర్వేరుగా జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. నేరుగా బాలికలతో వారు మాట్లాడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి త్వరగా వారు కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. కాగా ఎమ్మెల్యే స్వయంగా బాలికలకు ఆహారాన్ని తినిపించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విఛారణకు అదేశించారు.
విద్యార్థి సంఘాల నిరసన..
కలుషిత ఆహారం తినడం వల్లే కసూరిబా గాంధీ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైయ్యారని ఇందుకు బాద్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యు నాయకులు ఎం. మహేశ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను పరమార్శించిన అనంతరం కస్తూరిబా పాఠశాల ఎదుట నిరసన కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిన మహేశ్‌కుమార్ మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో బాలికలకు సరైన పౌష్టికాహారం అందించకుండా నిర్లక్షం వహిస్తున్న పాఠశాల అధికారులపై చర్యలు తీసకోవాలని కోరారు. ఈ ఘటనపై సమగ్ర విఛారణ జరిపించి బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విజయ్ నీష్మ, త్రిష, సుష్మత్, ఉష, కావ్య, దిలీప్, శివాజీ, నితిన్, వివేక్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News