Saturday, November 23, 2024

ఒకే రోజు 100మంది విద్యార్థులకు కొవిడ్

- Advertisement -
- Advertisement -

మళ్లీ క్లస్టర్లు, స్కూల్స్, హాస్టల్స్‌లో కరోనా పరీక్షలు
నాగోల్, మంచిర్యాలలో కంటైన్మెంట్ జోన్‌లు

Cabinet Secretary Rajiv Gauba Review on Covid 19

మన తెలంగాణ/హైదరాబాద్: పాఠశాలలపై కొవిడ్ పంజా విసురుతోంది. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని భయ బ్రాంతులకు గురిచేస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్కూళ్లల్లో 100 మంది విద్యార్ధులు వైరస్ బారినపడ్డట్లు వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులూ భయా ందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఉన్న పిల్లలను వారి తల్లిదండ్రు లు ఇళ్లకు తీసుకువెళ్లిపోయారు.తమ పిల్లలకు చదువు కంటే ఆరోగ్యమే ముఖ్యమని పలువురు పేరెంట్స్ తేల్చిచెబుతున్నారు. కరోనా నిబంధనలు పాటించకపోవడం వలనే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఓ విద్యార్ధి పేరెంట్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి స్కూళ్లు తెరిచే సమయంలో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ కనీసం ఒక్క స్కూల్ కూడా వాటిని సమర్ధవంతంగా అమలు చేయడం లేదు. దీంతో విద్యార్ధుల్లో భౌతిక దూరం లేకపోవడం, జనసమ్మర్ధ ప్రాంతాల్లో తిరగడంతో వైరస్ తీవ్రత పెరుగుతుందని ఓ అధికారి అన్నారు. అంతేగాక ఒక్కో క్లాస్‌లో కేవలం 50 శాతం పిల్లలకు మాత్రమే తరగతులను నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. కానీ అనేక స్కూళ్లల్లో పరిమితి కంటే అదనంగా విద్యార్ధులను కూర్చోపెట్టి క్లాస్‌లు చెబుతున్నారు. మరోవైపు కోచింగ్ సెంటర్లు, కళాశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
వివిధ పాఠశాలల్లో విజృంభణ…
హైదరాబాద్‌లోని నాగోల్ బండ్లగూడ మైనారిటీ గురుకుల వసతి గృహంలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 36 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. 169 మంది విద్యార్థినీలు ఉన్న ఈ హాస్టల్‌లో లక్షణాలు ఉన్న వారందరికీ టెస్టులు చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి పాజిటివ్ వచ్చిన వారందరినీ 5వ అంతస్తులో ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. తీవ్రత ఎక్కువైతే గచ్చిబౌలిలోని కిమ్స్‌ను తరలిస్తామన్నారు. నెగటివ్ వచ్చినా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు పాఠశాల అధికారులు తెలిపారు. అంతేగాక కలెక్టర్ ఆదేశాలతో మిగతా పిల్లలందరికీ ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేపిస్తున్నామన్నారు. దీంతో పాటు మంచిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనూ పలువురు ఉపాధ్యాయులు, వంట సిబ్బంది, విద్యార్ధుల్లో ఇప్పటి వరకు 49 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీనిలో 19 మంది టెన్త్, 9 మంది తొమ్మితో తరగతి, ఒకరు ఎనిమిదో తరగతి విద్యార్ధులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతానికి వీరందరికీ ప్రత్యేక హాల్‌లో ఉంచినట్లు స్కూల్ ఆఫీసర్లు తెలిపారు.ఇప్పటికే ఈ రెండు పాఠశాలల పరిధిలో కంటైన్‌మెంట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు కామారెడ్డి మారెడ్డి కస్తుర్బా గాంధీ స్కూల్‌లో పదిహేను మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు ఈ ఒక్క స్కూల్‌లోనే 29 మంది బాధితులు తేలారు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మిగతా స్కూళ్లు, కార్యాలయాలంతా ఉలిక్కిపడ్డాయి. అయితే కేసులు పెరుగుతున్న ప్రతి ప్రాంతాన్ని క్లస్టర్లుగా విభజిస్తామని ఓ అధికారి అన్నారు. ఈ తర్వాత బాధితులకు కావాల్సిన మౌళిక వసతులు, నిత్యావసర వస్తువులను స్వయంగా తామే అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. కరోనా కట్టడికి మొదట్లో పాటించిన నిర్ణయాలను మళ్లీ పునరావృతం చేస్తామన్నారు. అయితే ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్షం వహించవద్దని, మాస్కు, భౌతికదూరం, శానిటేషన్ వంటి ప్రాథమిక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు కోరారు.
మళ్లీ క్లస్టర్లు…
రాష్ట్రంలో మళ్లీ క్లస్టర్లు ఏర్పాటు చేయబోతున్నారు. అంతేగాక ప్రతి స్కూల్, హాస్టల్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్యశాఖ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా కేసులు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో పకడ్బందీగా వీటిని ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ మంగళవారం అన్ని జిల్లాల డిఎంహెచ్‌ఓలకు సూచించింది. దీంతోపాటు కాంటాక్ట్‌లను వేగంగా ట్రేస్ చేయాలని ఆదేశించింది. పాజిటివ్ సోకిన బాధితులను ఐసోలేషన్ సెంటర్లుకు తరలించాలని పేర్కొంది. అంతేగాక ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు యాంటీజెన్ టెస్టు విధానంలో వెంటనే టెస్టు చేసి క్వారంటైన్‌లో ఉంచాలంది. లక్షణాలు ఉన్న వారిని, ప్రైమరీ కాంటాక్ట్‌లను హాస్టల్స్‌లో వేర్వేరు రూంలలో ఉంచాలని సూచించింది. అలాంటి సౌకర్యం లేనిచో వెంటనే ప్రభుత్వం ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న క్వారంటైన్ సెంటర్లకు తరలించాలని వివరించింది. మరోవైపు పాజిటివ్ వచ్చిన బాధితులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా విద్యార్ధులను తల్లిదండ్రుల వద్దకు పంపొద్దని వైద్యశాఖ స్పష్టం చేసింది. దీంతో వైరస్ తీవ్రత మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ప్రతి విద్యార్ధిని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు.

36 students test positive in gurukul hostel in Nagole

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News