Sunday, January 19, 2025

దేశంలో కొత్తగా 360 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: భారత్ లో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో 360 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 4,46,70,075కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,41,33,433 మంది వైరస్ నుంచి కోలుకుని ఇండ్లకు చేరుకున్నారు. దేశంలో ప్రస్తుతం 6,046కు యాక్టివ్‌ కేసులున్నాయి.

తాజాగా కరోనాతో ఐదుగురు మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 5,30,596కు చేరుకుంది. ఇక, దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.80 శాతం, మరణాలు 1.19శాతంగా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 219.87 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News