Wednesday, January 22, 2025

యుబిఎస్‌లో 36,000 ఉద్యోగాల కోత

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : సంక్షోభంలో ఉన్న ప్రత్యర్థి సంస్థ క్రెడిట్ సూయిస్‌ను స్వాధీనం చేసుకోవడం పూర్తి అయిన తర్వాత యుబిఎస్ గ్రూప్ ఎజి తన ఉద్యోగుల్లో 20 నుంచి 30 శాతం ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. అంటే విలీనం జరిగిన తర్వాత యుబిఎస్ 36 వేల మంది ఉద్యోగులపై వేటుపడనుంది. ఈమేరకు టేజెస్ అంజీగర్ నివేదిక వెల్లడించింది. సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ను కాపాడేందుకు స్విస్ ప్రభుత్వం నిర్ణయించిన మేరకు 3 బిలియన్ స్విస్ ఫ్రాన్సెస్(3.3 బిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేసేందుకు యుబిఎస్ అంగీకరించింది. ఇప్పటికే స్విట్జర్లాండ్‌లో 11 వేల మంది ఉద్యోగులపై వేటు పడిందని స్విస్ న్యూస్‌పేపర్ వెల్లడజించింది. 2022 ఆఖరు నాటికి ఈ రెండు బ్యాంకుల్లో మొత్తం 1,25,000 మంది ఉద్యోగులు ఉండగా, ఒక్క స్విట్జర్లాండ్‌లోనే 30 శాతం మంది ఉద్యోగులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News