Wednesday, January 22, 2025

తెలుగు రాష్ట్రాలలో తగ్గని కొవిడ్ ఉధృతి

- Advertisement -
- Advertisement -
3603 new covid cases reported in telangana
ఏపీలో 14,440 తెలంగాణలో 3,603 కొత్త కేసులు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు నమోదు తగ్గడం లేదు. ఏపీలో 14,440 కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 3,603 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 93,397 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,603 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,34,815కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,421 కేసులు నమోదయ్యాయి.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 308, రంగారెడ్డి జిల్లాలో 262 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,072కు చేరింది. తాజాగా కరోనా నుంచి 2,707 మంది కోలుకోగా, ఇప్పటివరకు 6,98,815 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 95.08 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.55 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,397 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 97,133 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

ఏపీలో 14 వేలు దాటిన కొత్త కేసులు

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,650 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మృతి చెందారు. కరోనా బారి నుంచి తాజాగా 3,969 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 83,610 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258, అనంతపురంలో 1,534, గుంటూరు 1,458, ప్రకాశం 1,399, కర్నూలు 1,238, చిత్తూరు 1,198, తూర్పుగోదావరి 1,012, నెల్లూరు, 1,103, కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటివరకూ 14,542 మంది మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News