Monday, December 23, 2024

365 పర్యావరణ సూక్తుల క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి

- Advertisement -
- Advertisement -

 

సూర్యాపేట: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దుల చెరువు మినీట్యాన్క్ బండ్ వద్ద గ్రీన్ క్లబ్ వారు రూపొందించిన క్యాలెండర్ ను రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 365 పర్యావరణ సూక్తుల క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. మన కోసం ముందు తరాల కోసం మొక్కలు నాటాలని గ్రీన్ క్లబ్ వాళ్లు పిలుపునిచ్చారు. సహజ వనరులను పొదుపుగా వాడి ముందు తరాలకు అందిందాం, పర్యావరణాన్ని రక్షిద్దాం… మానవాళిని రక్షిద్దాం… జల, వాయు, భూ, ధ్వని కాలుష్యాన్ని నివారిద్దాం.. ఆకుపచ్చని పర్యావరణం ఆరోగ్యానికి సోపానం అని గ్రీన్ క్లబ్ వాళ్లు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News