Thursday, January 23, 2025

మక్కాకు చేరుకున్న 37 హజ్ యాత్రికుల బృందాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హజ్ యాత్రికుల 37వ బ్యాచ్‌ను హజ్ కమిటీ చైర్మన్ మొహమ్మద్ సలీం జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం నాంపల్లి హజ్ హౌస్ నుండి 37వ బ్యాచ్ యాత్రికులు బస్సు ద్వారా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలు దేరారు. కాగా ఇప్పటి వరకు 37 బ్యాచ్‌లలో మొత్తం 5,550 మంది యాత్రికులు క్షేమంగా మక్కా చేరుకున్నారని మొహమ్మద్ సలీం తెలిపారు. 37వ బ్యాచ్‌లో జామియా నిజామియాకు చెందిన ముఫ్తీ అన్వర్ అహ్మద్ ఖాద్రి కూడా ఉన్నారు.

హజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని చైర్మన్ సలీం తెలిపారు. తెలంగాణ హజ్ కమిటీ హజ్ యాత్రికులకు అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. నాంపల్లి హజ్ హౌస్ నుండి ఎయిర్ కండీషన్డ్ బస్సుల ద్వారా హజ్ యాత్రికులను పోలీసు ఎస్కార్ట్‌తో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ గులామ్ అహ్మద్ హుస్సేన్, సయ్యద్ ఇర్ఫానుల్ హఖ్ (కరీంనగర్), తెలంగాణ హజ్ కమిటీ ఎఈఓ ఇర్ఫాన్ షరీఫ్,  ఇతర అధికారులు పాల్గొన్నాన్నారు.

Haj 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News