- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం రోజుకు సగటున 13,555 రైళ్లు నడుస్తున్నాయని, వీటిలో 37 శాతం రైళ్లు డీజిల్ ఇంజన్లతో నడుస్తున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా జవాబిస్తూ మిగిలిన 63 శాతం రైళ్లు ఎలెక్ట్రిక్ ఇంజన్లతో నడుస్తున్నాయని తెలిపారు. 2019-20 సంవత్సర వార్షిక గణాంకాల ప్రకారం&డీజిల్ ఇంజన్ల కోసం 2,370.55 మిలియన్ లీటర్ల డీజిల్ ఖర్చు కాగా ఎలెక్ట్రిక్ ఇంజన్ల కోసం 13,854.73 మిలియన్ కెడబ్లుహెచ్ ఖర్చయ్యాయని మంత్రి వివరించారు. దీని ప్రకారం రోజుకు 6.49 మిలియన్ లీటర్ల డీజిల్, 37.96 మిలియన్ కెడబ్లుహెచ్ విద్యుత్ ఖర్చయ్యాయని ఆయన తెలిపారు.
- Advertisement -