- Advertisement -
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రాలో కరోనా వైరస్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. రోజు రోజుకు మహారాష్ట్రాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్క రోజే 1000పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 3714 కరోనా కేసులు నమోదుకాగా ఏడుగురు మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 4.31 కోట్లకు చేరుకోగా 5.24 లక్షల మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 194.27 కోట్ల డోసులు పంపిణీ చేశారు.
- Advertisement -