- Advertisement -
న్యూఢిల్లీ: గత 24 గంటల వ్యవధిలో మూడు వేలకు పైగా కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,50,735 మందికి కరోనా పరీక్షలు చేయగా, 3720 కొత్త కేసులు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 4,49,56,716 కి చేరింది. దేశంలో యాక్టివ్ కేసులు 40,177 కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి 4,43,84,955 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 20 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,31,584కి చేరింది. రికవరీ రేటు 98.73 కాగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. ఇప్పటివరకు 220.66 కట్ల డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.
- Advertisement -