కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య వెల్లడి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న దేశాల నుంచి 19 విమానాల ద్వారా 3,726 మంది భారతీయులను తీసుకురావడానికి భారతీయ వైమానిక దళం(ఐఎఎఫ్), భారతీయ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ 19 విమానాలు గురువారం నడపనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఆపరేషన్ గంగ కింద ఐఎఎఫ్ 8 విమానాలు, ఎయిర్ ఇండియా, ఇండిగో ఇతర విమానాలను రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి భారత్‌కు గురువారం నడపనున్నట్లు ట్విటర్‌లో ఆయన తెలిపారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించే కార్యక్రమం కోసం ఐఎఎఫ్ తన సి 17 సైఇన రవాణా విమానాన్ని నడుపుతోందని ఆయన చెప్పారు. రష్యా సైనిక దాడి దరిమిలా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేయడంతో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను పొరుగుదేశాలైన రొమేనియా, హంగరి, పోలాండ్ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారత్ తరలిస్తోంది. రొమేనియాకు చెందిన సుసీవ నుంచి రెండు ఇండిగో విమానాలు, స్లోవేకియాకు చెందిన కోసిసె నుంచి ఒక స్పైస్‌జెట్ విమానం గురువారం భారత్‌కు బయల్దేరుతాయని ఆయన చెప్పారు.పోలాండ్‌లోని జెస్‌జో నుంచి భారత్‌కు ఇండిగో రెండు విమానాలు నడుపుతుందని ఆయన తెలిపారు.