Friday, November 22, 2024

తెలంగాణలో కొత్తగా 3,726 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 3,726 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 20మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,63,903కు చేరుకుంది. కరోనాతో ఇప్పటివరకు 3,189మంది మరణించారు. గత 24 గంటల్లో 3,816మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 5,22,082మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 38,632 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు.. ‘ప్రస్తుతం తెలంగాణ ఆస్పత్రుల్లో కోవిడ్ అడ్మిషన్స్ తగ్గాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 92.52 శాతం ఉంది. అలాగే డెత్ రేటు 0.52 శాతం ఉండగా, కరోనా పాజిటీవిటి రేటు 0.38 శాతం ఉంది’ అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News