Sunday, December 22, 2024

రికార్డు సృష్టించిన శ్రీలంక అధ్యక్ష ఎన్నిక.. బరిలో 38 మంది అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

కొలంబో: ఈ ఏడాది సెప్టెంబర్ 21న జరగనున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన డిపాజిట్ చెల్లింపునకు బుధవారం మధ్యామ్నం గడువు ముగియగా 42 సంవత్సరాల శ్రీలంక చరిత్రలో మొట్టమొదటిసారి 38 మంది అభ్యర్థులు డిపాజిట్ చెల్లించారు.

ఈ 38 మంది అభ్యర్థులలో 20 మంది రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల నుంచి కాగా 17 మంది స్వతంత్రులు. ఒక అభ్యర్థి సమన్ శ్రీ రత్నాయకె రాజకీయ గ్రూపునకు చెందిన వ్యక్తి. నామినేషన్ల స్వీకరణకు గురువారంతో గడువు ముగుస్తుంది. డిపాజిట్లు చెల్లించిన 38 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించిన పక్షంలో శ్రీలంకలో ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడం ఇదే మొదటిసారి అవుతుంది. 2019లో చివరిసారి అధ్యక్ష ఎన్నికలు జరిగినపుడు 35 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

పోటీలో నిలుస్తున్న ముఖ్యులలో ప్రస్తుత అధ్యక్షుడు విక్రమసింఘెతోపాటు రాజపక్స వారసుడిగా బరిలోకి దిగుతున్న 38 ఏళ్ల నమల్ రాజపక్స, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాస, మార్కిస్టు జెవిపి నాయకుడు అనుర కుమార దిసనాయకె తదితరులు ఉన్నారు. 1982లో మొదటిసారి జరిగిన అధ్యక్ష ఎన్నికలో కేవలం ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ పడ్డారు. శ్రీలంకలోని 22 జిల్లాలకు చెందిన 1.70 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News