- Advertisement -
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఇందిరాపురం ప్రాంతం కనవాణి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచరేసుకుంది. డంపింగ్ యార్డులో మంటలు అంటుకోవడంతో గోశాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 38 ఆవులు సజీవదహనమయ్యాయి. శ్రీ కృష్ణ గోశాల నిర్వహకుడు సూరజ్ పండిట్ మీడియాతో మాట్లాడారు. డంపింగ్ యార్డు నుంచి మంటలు వేగంగా వ్యాపించడంతో తాము స్పందించే లోపు గోశాల కాలి బూడిద అయ్యందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు గోశాలలో 200 వరకు ఆవులు ఉన్నాయన్నారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -