- Advertisement -
గుజరాత్: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి మరణ శిక్ష విధిస్తూ అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2008 జులై 26న అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లు జరిగాయి. 70 నిమిషాల వ్యవధిలో 21 సార్లు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో 56 మంది మృత్యువాతపడగా 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిద్దీన్ హర్కత్ ఉల్ జీహాదీ అల్ ఇస్లామీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించారు. 49 మందిని సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది.
- Advertisement -