జాతీయ నేర రికార్డుల బ్యూరో నివేదికలో వెల్లడి
నిర్లక్షం, నాసిరకం విద్యుత్ పరికరాల వినియోగమే కారణం
విద్యుత్ రంగ నిపుణులు
హైదరాబాద్: గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి పల్లెకు విద్యుత్ లైన్లు విస్తరించడంతో 100 శాతం విద్యుద్ధీకరణ లక్షం నెరవేరింది. వివిధ గృహోపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. అనేక పరిశ్రమలు నెలకొల్పడం, వ్యసాయ మోటార్ల విస్తృత వినియోగం తదితర కారణాలతో వి ద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. అంతర్జాతీయ తలసరి సగటు వి ద్యుత్ వినియోగం 2674 యూనిట్లు ఇది మన దేశంలో 1181 యూనిట్లు ఉండగా తెలంగాణలో 1896,అదే విధంగా ఏపీలో 1234 యూనిట్లుగా నమోదైంది. ఇది మంచిపరిణామమే అయినప్పటికి లైన్లు విస్తరిస్తున్న కొద్ది విద్యుత్ ప్రమాదాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమైని విద్యుత్ నిపుణులు అంటున్నారు.
జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బి) నివేదిక ప్రకారం 2018లో మన దేశంలో 12154 విద్యుత్ఘాతంతో, 1719 మంది విద్యుత్‌షార్ట్ సర్యూట్ కారణంగా ప్రమాదాల్లో చిక్కుకుని మరణించారు. అంటే సగటున రోజుకు విద్యుత్ ప్రమాదాల్లో 38 మంది తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోతున్నారు. విద్యుత్ఘాతానికి గురైనవారిలో 18 నుంచి 45 సంవత్సరాల వయసులో కుటుంబాన్ని పోషించేవారే 66 శాతం. విద్యుత్ ప్రమాదాల కారణంగా సుమారు 4893 జంతువులు మరణించడమే కాకుండా షార్ట్ సర్కూట్‌తో కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలవుతోంది.ఆస్తులు,వ్యాపారాలు నష్టపోతున వారెందరో. కేంద్ర ప్రభుత్వ జాతీయ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఏటా జూన్ 26నజాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన పెంపొందిస్తుంది. ఈ సంవత్సరం కరోనా కారణంగా సంబంధిత సంస్థలు వివిద కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళలేక పోయాయి. నాసరకం విద్యుత్ పరికరాలను ఉపయోగించడం, తీగల సామర్ధాన్ని మించి విద్యుత్ వాడకం,నైపుణ్యం లేనివారితో విద్యుత్పనులు చేపట్టడం, సరైన భద్రతా పనిముట్లు,ప్రామాణిక పద్దతులు పాటించక పోవడం, నిర్లక్షం వంటి కారణాలు విద్యుత్ ప్రమాదాలకు కారణం.
నాణ్యత ప్రమాణాలు లేని ఉపకరణాలను ఉత్పత్తి చేయకుండా నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా అటువంటి ఉత్పత్తులను కొనకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది. విద్యుత్ ఉపకరణాలు అమ్మే సయంలో వాటిని వాడే పద్దతులను వివరిస్తూ స్థానిక భాషలో కరపత్రాలు అందచేస్తే వినియోగదారులు జాగ్రత్త పడేఅవకాశం ఉంది. విద్యుత్ తీగల వ్యవస్థ ఏర్పాటు పనుల్ని సురక్షితమైన సిబ్బంది మాత్రమే చేపట్టాలి. పనిచేసేప్రదేశాల్లో విద్యుత్ ప్రమాదాలు ఇతర దేశాల్లో పదిశాతం లోపే ఉండగా మన దేశంలో మాత్రం 86 శాతం వరకు చోటుచేసుకుంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. విద్యుత్ ప్రమాదాలకు లోనైన వారు 18 శాతం సంబందిత శాఖకు చెందిన కార్మికులే. వా రికి పనిలో మెళకువలు నేర్పి భద్రతా పనిముట్లు అందచేయాల్సిన అవసరం ఉందని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి రాష్ట్రంలో విద్యుత్ తనిఖీ అధికారి నేతృత్వంలో విద్యుత్ సంబంధిత తనిఖీలు కేవలం భారీ పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, సినిమాహాళ్ళు,15 సంవత్సరాల పైబడిన ప్రభవనాలకే పరిమితమితం కావడంతోనే ఇటువంటి విద్యుత్ప్రమాదాల చోటు చేసుకుంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.