- Advertisement -
శ్రీలంకలో సెప్టెంబర్ 21న జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్న 39 మందిలో ముగ్గురు మైనారిటీ తమిళులు, ఇద్దరు బౌద్ధ సన్యాసులు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. అయితే 39 మంది అభ్యర్థులలో ఒక్క మహిళా అభ్యర్థి కూడా లేకపోవడం విశేషం. 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో 35 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 1982 అక్టోబర్‌లో మొదటిసారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. బుధవారంతో డిపాటిట్ల చెల్లింపునకు గడువు ముగియగా గురువారం ఉదయం 9 నుంచి ఉదయం 11 గంటల వరకు (స్థానిక కాలమానం) చివరి రోజు నామినేషన్ల స్వీకరణ జరిగింది. దీంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. మొత్తం 40 మంది డిపాజిట్లు చెల్లించగా ఒక అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు.
- Advertisement -