Thursday, December 26, 2024

చేపల నౌక తలకిందులై 39 మంది గల్లంతు

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : హిందూ మహాసముద్రంలో చైనా చేపల నౌక తలకిందులై 39 మంది గల్లంతయ్యారు. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో నౌకలో 17 మంది చైనా సిబ్బంది, 17 మంది ఇండోనేసియన్లు, ఐదుగురు ఫిలిప్పైన్లు ఉన్నారని ప్రభుత్వ మీడియా జిజిటిఎన్ బుధవారం వెల్లడించింది.

గల్లంతైన వారి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం తగిన ప్రయత్నాలు చేయాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు. సంబంధిత విభాగాలన్నీ అప్రమత్తమై అత్యవసర యంత్రాంగాన్ని తక్షణం కార్యరంగం లోకి దింపాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News