Thursday, November 14, 2024

ఒకే ఓవర్ లో 39 పరుగులు…. యువీ రికార్డు బద్ధలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టి20 ప్రపంచ కప్ 2026 మెగా టోర్నీ కోసం క్యాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. సమోవా- వనువాటు దేశాల మధ్య టి20 మ్యాచ్ జరిగింది. సమోవా బ్యాట్స్‌మెన్ డేరియస్ విస్సెర్ రికార్డు సృష్టించాడు. ఒకే ఓవర్‌లో 39 పరుగులు చేసి యువి రికార్డును బద్దలుకొట్టాడు. ఒకే ఓవర్ ఆరు సిక్స్‌లు కొట్టాడు. వరసగా మాత్రం ఆరు సిక్స్‌లు కొట్టలేదు. 15వ ఓవర్‌ను బౌలర్ నిలిన్ నిపికో వేయగా మొదటి మూడు బుంతులను డేరియస్ సిక్స్‌లుగా మలిచాడు. నాలుగు బంతి నోబాల్ పడింది. వెంటనే సిక్స్ బాదాడు ఐదో బంతికి జీరో పరుగులు వచ్చాయి. ఆరో బంతి నోబాల్ పడింది కానీ మళ్లీ నోబాల్ వేయడంతో సిక్స్ కొట్టాడు. ఆరో బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో ఒకే ఓవర్‌లో 39 పరుగులు చేయడంతో డేరియస్ రికార్డు సృష్టించాడు. గతంలో యువరాజ్ సింగ్(2007), కీరన్ పొలార్డ్(2021), నికోలస్ పూరన్(2024), దీపేంద్ర సింగ్(2024) మాత్రమే 36 పరుగులు చేశారు. 2007 టి20 వరల్డ్ కప్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ ఆరు సిక్స్‌లు కొట్టిన సంగతి తెలిసిందే. సమోవా-వనువాటు మధ్య జరిగిన మ్యాచ్‌లో సమోవా బ్యాట్స్‌మెన్ డేరియస్ 62 బంతుల్లో 14 సిక్స్‌లు, ఐదు ఫోర్ల సహాయంతో 132 పరుగులు చేశాడు. సమోవా తొలుత బ్యాటింగ్ చేసి 175 పరుగులు లక్ష్యాన్ని వనువాటు జట్టు ముందు ఉంచింది. వనువాటు జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పది పరుగుల తేడాతో సమోవా గెలుపొందింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News