Friday, November 15, 2024

స్వచ్ఛ విద్యాలయ పురస్కారం కోసం 39 స్కూళ్ల ఎంపిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2021-22 విద్యా సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా 39 పాఠశాలను స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ కోసం ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యా శాఖ శనివారం ప్రకటించింది. 8.23 లక్షల ఎంట్రీలనుంచి ఈ స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో 28 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలుండగా, 11 ప్రైవేటు పాఠశాలున్నాయి. అవార్డులు ప్రకటించిన వాటిలో రెండు కస్తూర్బా బాలికల పాఠశాలలు, ఒక నవోదయ విద్యాలయం, మూడు కేంద్రీయ విద్యాలయాలున్నాయి. తాగు నీరు, శానిటేషన్, పరిశుభ్రత వంటి వాటి విషయంలో అసాధారణ ప్రగతిసాధించినందుకు ఇచ్చే ఈ పురస్కారాలు ఆ పాఠశాలలకు గౌరవంగా మాత్రమే కాక, మిగతా పాఠశాలు కూడా ఇదే విధమైన మెరుగుదల సాధించడానికి ఒక బెంచ్‌మార్క్‌గా కూడా నిలుస్తాయి.

తాగు నీరు, టాయిలెట్లు, సబ్బుతో చేతులు కడుక్కోవడం, నిర్వహణ, పిల్లల ప్రవర్తన్తలో మార్పు, సామర్థం పెంపు, కొవిడ్19(సన్నద్ధత, స్పందన) అనే ఆరు కొలమానాల ఆధారంగా ఈ స్కూళ్లను ఎంపిక చేశారు. ‘మొత్తం 39 స్కూళ్లలో 17 ఎలిమెంటరీ, 22 సెకండరీ, హయ్యర్ సెకండరీస్కూళ్లు ఉన్నాయి. ఓవరాల్ కేటగిరీలో 34 పాఠశాలలకు రూ.60,000, సబ్ కేటగిరీలలోని స్కూళ్లకు రూ.20,000 చొప్పున నగదు పురస్కారాన్ని ఈ రోజు అందజేయడం జరిగింది’ అని విద్యాశాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. మూడో సారి ప్రదానం చేసిన ఈ అవార్డు కోసం మొత్తం 9.59 లక్షల స్కూళ్లు పాలు పంచుకున్నాయి.

39 Schools selected for Swachh Vidyalaya Puraskar 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News