Monday, December 23, 2024

ఐబిఎంలో 3,900 ఉద్యోగాల కోత

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : లేఆఫ్‌ల జాబితాలో టెక్ దిగ్గజం ఐబిఎం(ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్) కూడా చేరింది. తాజాగా ఈ కంపెనీ 3,900 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. కంపెనీలో మొత్తం 2.80 లక్షల మంది ఉద్యోగులకు గాను 1.4 శాతం లేఆఫ్ ఉంటుందని కంపెనీ వార్షిక నివేదికలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక ప్రతికూల పరిస్థితుల కారణంగా ఉద్యోగులను తొలగించిన దిగ్గజ ఐటి కంపెనీలు మెటా, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, గూగుల్ జాబితాలో ఇప్పుడు ఐబిఎం చేరింది. ఐబిఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ ప్రకారం, ఉద్యోగుల తొలగింపుల వల్ల జనవరి- మార్చి కాలంలో కంపెనీకి 300 మిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా సంస్థ అనేక కీలక చర్యలను తీసుకుందని, దీని ఫలితంగా వ్యాపారంలో కొన్ని ఖర్చులు పెరిగాయని అన్నారు. 2022 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 16.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని, 3.8 బిలియన్ డాలర్ల నిర్వహణకు ముందు ఆదాయాన్ని సాధించింది ఐబిఎం ప్రెసిడెంట్, సిఇఒ అరవింద్ కృష్ణ మాట్లాడుతూ, సాఫ్ట్‌వేర్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి హైబ్రిడ్ క్లౌడ్, ఎఐ సామర్థ్యాలలో పెట్టుబడి పెట్టామని అన్నారు. ఈ సంవత్సరం అధిక ఉత్పాదకతను సాధిస్తామని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరింపజేస్తామని అన్నారు. మరిన్ని పెట్టుబడులు పెడతామని కృష్ణ అన్నారు.

సాప్‌లో 3000 మందిపై వేటు

జర్మనీకి చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ సాప్ ఎస్ కూడా ఈ సంవత్సరంలో సుమారు 3000 మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. అదే సమయంలో క్వాల్ట్రిక్స్ ఇంటర్నేషనల్‌లో మిగిలిన వాటాను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 2023 సంవత్సరానికి కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ 8.8 9.1 బిలియన్ యూరోల శ్రేణి సర్దుబాటు అంచనా వేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News