- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. శనివారం అర్థరాత్రి తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో కూరగాయల లోడుతో వచ్చిన ట్రాలీ వాహనాన్ని పరిశీలించగా 391 కేజీల ఎండు గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే, వాహనాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
391 Kg Ganja Seized in Bhadrachalam
- Advertisement -