Friday, January 24, 2025

ఎంపిడివోల బదిలీలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వం భారీగా ఎంపీడీఓల బదిలీ చేసింది. రెండు రోజుల కితం డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసిన సర్కార్ ఆదివారం ఎంపీడీఓలకు స్థానం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని గతేడాది డిసెంబర్‌లో ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇసి మార్గదర్శకాల మేరకు మండల పరిషత్ డెవలప్‌మెంట్ అధికారులను బదిలీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 15 మందిని నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలకు, భద్రాద్రి కొత్తగూడెంలో 15 మంది ఖమ్మం,

మహబూబాబాద్, జనగాం జిల్లాలకు బదిలీ చేసింది. హన్మకొండ 05 మంది, జగిత్యాల 15 మంది, జనగాం 06 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 08 మంది, జోగులాంబ గద్వాల్ 06 మంది, కొమురంభీ ఆసిఫాబాద్ 08 మంది, కామారెడ్డి 13 మంది, కరీంనగర్ 12 మంది, ఖమ్మం 18 మంది, మహబూబాబాద్ 16 మంది, మహబూబ్‌నగర్ 12 మంది, మంచిర్యాల 15 మంది, మెదక్ 13 మంది, మేడ్చల్ మల్కాజిగిరి 03 మంది, ములుగు 06 మంది, నాగర్‌కర్నూల్ 12 మంది, నల్లగొండ 28 మంది, నారాయణపేట 08 మంది, నిర్మల్ 14 మంది, నిజామాబాద్ 20 మంది, పెద్దపల్లి 09 మంది, రాజన్న సిరిసిల్ల 09 మంది, రంగారెడ్డి 14 మంది,సంగారెడ్డి 20 మంది, సిద్దిపేట 18 మంది, సూర్యాపేట 13 మంది, వికారాబాద్ 11 మంది,వనపర్తి 09 మంది, వరంగల్ 10 మంది, యాద్రాద్రి భువనగిరి 14 మంది బదిలీ చేసింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News