- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62,591 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,961 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మరో 30 మంది కోవిడ్ తో మృతి చెందారు. అదే సమయంలో 5,559 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 49,341 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో మరో 631, మేడ్చల్ 258, రంగారెడ్డి 257 కరోనా కేసులు బయటపడ్డాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.
3961 new covid-19 cases reported in telangana
- Advertisement -