- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉదృతి మళ్లీ పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,962 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 26 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 2,697 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. భారత్ లో ప్రస్తుతం 22,416 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 193.96 కోట్ల మందికి కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలు 85.22 కోట్లు దాటాయని కేంద్రం ప్రకటించింది. గత వారం రోజులుగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా, వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఐదు రాష్ట్రాలను కేంద్రం కోరింది.
- Advertisement -