Monday, January 6, 2025

భద్రాచలంలో 3కె రన్

- Advertisement -
- Advertisement -

భద్రాచలం :తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం భద్రాచలం పోలీస్ ఆధ్వర్యంలో జూనియర్‌ కాలేజి నుండి బ్రిడ్జి సెంటర్ వరకు 3కె రన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ఐటిడిఎ పిఓ పోట్రు గౌతమ్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం భద్రాచలం ఎఎస్‌పి పారితోష్ పంకజ్, సిఆర్‌పిఎఫ్ 141 బెటాలియన్ కమాండెట్ ప్రశాంత్‌ధర్, ఇతర అధికారులతో కలిసి ఆయన రన్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వం, ఐకమత్యానికి ఈ 3కె రన్ ప్రతీకగా ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిదేళ్లలో ఆయా శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడమే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముఖ్యోద్ధేశమన్నారు. వృద్ధులు మొదలుకొని విద్యార్థులు ప్రతీరోజు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారన్నారు. అనంతరం ఎఎస్‌పి పారితోష్ పంకజ్ మాట్లాడుతూ.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్‌శాఖ ద్వారా 3కె రన్ నిర్వహించామని, దైనందిన కార్యక్రమాల్లో వ్యాయమం కూడా ఒక భాగం కావాలని, అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నారు.

స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజి నుంచి ప్రారంభమైన ఈ 3కె రన్ సాయిబాబా గుడి మీదుగా బ్రిడ్జిసెంటర్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆర్‌డిఒ రత్నకల్యాణి, అసిస్టెంట్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సాంబదుర్గ, సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాడెంట్ కమల్‌వీర్‌యాదవ్, సింగరాహవులు, సంజీవ్‌భగత్, కృష్ణారెడ్డి, ఇంటిలిజెన్స్ ఎస్‌ఐ యాకూబ్, మునికృష్ణ, శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వ్యాపారస్థులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News