Monday, December 23, 2024

మూడున్నర కిలోల కణతి తొలగింపు

- Advertisement -
- Advertisement -

వరంగల్: ఓ మహిళ కడుపులో ఉన్న మూడున్నర కిలోల కణితిని తొలగించి సర్జరీని విజయవంతం చేశామని హనుమకొండలోని శ్రీనివాస కిడ్నీ సెంటర్ డాక్టర్ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ జులైవాడకు చెందిన కోరుట్ల స్వరూప కడుపులో మూడున్నర కిలోల కణితి ఏర్పడింది. ఈ కణితి తొలగింపు కోసం పలు కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకపోవడంతో తమ ఆసుపత్రిని సంప్రదించినట్లు రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

ఈ కణతి కుడి కిడ్నీకి కాలేయానికి, పెద్ద పేగులకు మధ్య ఉండటంతో సర్జరీ క్లిష్టతరంగా మారిందని చెప్పారు. గత నెల 31న మూడు గంటలకు పైగా సర్జరీ నిర్వహించి కణతిని తొలగించినట్లు తెలిపారు. మూడు లక్షల ఖర్చు అయ్యే ఆపరేషన్‌ను తమ ఆసుపత్రిలో కేవలం రూ.70వేలకే పూర్తి చేసి సోమవారం పేషంట్‌ను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. సర్జరీలో తనతో పాటు డాక్టర్ ఉపేందర్, డాక్టర్ ఆకాష్, డాక్టర్ సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News