Friday, April 25, 2025

పాఠశాలలో పాము కాటుకు గురైన 3వ తరగతి విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: పాఠశాలలో పరిశుభ్రత లేదని, టాయిలెట్లు చెత్తచెదారంతో నిండిపోయి దుర్గంధం, దుర్వాసనగా మారాయని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండలం పెద్ద ఎల్కిచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని (అక్షిత) పాము కాటు గురైన సంఘటన మంగళవారం కలకలం రేపింది. టాయిలెట్ కు వెళ్లిన విద్యార్థినికి పాము మూడు కాట్లు వేసింది. దీంతో అక్షిత అక్కడేకుప్పకూలిపోయింది. గమనించిన సిబ్బంది చికిత్న నిమిత్తం అక్షితను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను చూసిన తోటి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News