Monday, December 23, 2024

రైతులను చంపిన దుస్సంఘటనకు వ్యతిరేకంగా అక్టోబర్ 3న నిరసన దినం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ కన్వీనర్లు, కార్మిక సంఘాల రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం రాజ బహదూర్ గౌర్ హాల్- మగ్దుం భవన్ -హిమాయత్ నగర్‌లో ఆదివారం జరిగింది. సంయుక్త కిసాన్ మోర్చా -కార్మిక సంఘాలు జాతీయస్థాయిలో ఇచ్చిన పిలుపులో భాగంగా 2023 అక్టోబర్ 3వ తారీఖున జిల్లా కేంద్రాలలో లఖీంపూర్ కేరిలో రైతులు , విలేకరి మరణానికి కారణమైన అజయ్‌కుమార్ మిశ్రాను మంత్రి వర్గం నుండి తొలగించాలని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ప్రదర్శనగా వెళుతున్న రైతులపై వాహనాలతో తొక్కించి కిరాతకంగా హత్య చేసిన అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు అశీస్ మిశ్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను-పంటల మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని -రుణ విముక్తి చట్టం చేయాలని,లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని, 57 సంవత్సరాలు నిండిన అందరికీ నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, సామాజిక సేవల కోసం ప్రైవేటీకరణను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని, మన రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగిస్తున్న రుణమాఫీ పూర్తి స్థాయిలో త్వరితగతిన చేయాలని, కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులు ఇవ్వాలని, వారికి బ్యాంకు లోన్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, 24 గంటల విద్యుత్తు సరఫరా నికరంగా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాలలో డివిజన్ మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ కార్మిక సంఘాలు సంయుక్తంగా విజ్ఞప్తి చేశాయి.

సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా స్థాయిలలో ఏర్పడిన కమిటీలు, రైతు సంఘాలు కార్మిక సంఘాలతో సంప్రదించుకొని అక్టోబర్ 3 నిరసన దినాన్ని పాటించాలని కోరుతున్నాం.

సంయుక్త కిసాన్ మోర్చా -కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సంతాప సభ
డాక్టర్ ఎమ్. ఎస్ స్వామినాథన్ మరణం రైతులకు , సామాన్య ప్రజలందరికీ వ్యవసాయ దేశ అభివృద్ధికి తీరని లోటుగా రైతు కార్మిక సంఘ నాయకులందరూ పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకలి తీర్చడానికి రైతు ఆత్మహత్యలను నివారించటానికి పంటల దిగుబడి పెంచటానికి అహర్నిశలు పాటుపడిన స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. పంటలకు పెట్టే ఖర్చుకు అదనంగా 50% కలిపి మద్దతు ధరలను నిర్ణయించి అమలు చేయగలిగితే రైతు ఆత్మహత్యలు జరగవని 2006 లోని కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసిన డాక్టర్ స్వామినాథన్ రైతులకు ప్రజలందరికీ మార్గదర్శకుడని డాక్టర్ స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం సాధించటం ఆహార భద్రతను సాధించటం ఒక్కటే డాక్టర్ స్వామినాథన్ గారికి అర్పించగలిగే నిజమైన నివాళిగా పేర్కొన్నారు.

పత్రికా సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ కన్వీనర్లు పశ్య పద్మ, టి సాగర్, ప్రభాకర్, బిక్షపతి, జక్కుల వెంకయ్య, నాగిరెడ్డి, ప్రసాద్, బాల మల్లేష్, ప్రసాద్, కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు బాల రాజ్, వెంకటేశ్వరరావు, సూర్యం , ప్రభు లింగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News