Sunday, November 24, 2024

పరువు కోసం టీమిండియా

- Advertisement -
- Advertisement -

3rd ODI between India vs South africa

క్లీన్‌స్వీప్ సౌతాఫ్రికా కన్ను, నేడు చివరి వన్డే

కేప్‌టౌన్: వరుస ఓటములతో ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయినా పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. తొలి రెండు వన్డేల్లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక రెండు మ్యాచుల్లో గెలిచి ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న సౌతాఫ్రికా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆతిథ్య దక్షిణాఫ్రికా సమతూకంగా కనిపిస్తోంది. ఓపెనర్లు మలాన్, డికాక్ కిందటి మ్యాచ్‌లో రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈసారి కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నారు. అంతేగాక కెప్టెన్ బవుమా, వండర్ డుసెన్, మార్‌క్రామ్‌లు కూడా జోరుమీదున్నారు.

బౌలింగ్‌లో కూడా సౌతాఫ్రికా నిలకడగా రాణిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా సఫారీ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక టీమిండియాకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయిన భారత్ చివరి మ్యాచ్‌లో గెలిచి పరువును కాపాడుకోవాలని భావిస్తోంంది. కిందటి మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినా ఫలితం లేకుండా పోయింది. బౌలర్ల వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు. వరుసగా విఫలమవుతున్న శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్‌ను, భువనేశ్వర్ స్థానంలో దీపక్ చాహర్ చోటు కల్పించే అవకాశాలున్నాయి. ఇక కెప్టెన్ రాహుల్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఆడిన రెండు మ్యాచుల్లోనూ టీమిండియా ఓటమి పాలైంది. దీంతో రాహుల్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా తయారైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News