Saturday, November 23, 2024

వచ్చే రెండు నెలల్లో స్వల్ప స్థాయిలో థర్డ్‌వేవ్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో రానున రోజుల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని ఇప్పటికే ఆయా దేశాలు అంచనాలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో మనదేశంలో స్వల్పస్థాయిలో థర్డ్‌వేవ్ కనిపించనుందని, ఫిబ్రవరిలో గరిష్ఠ స్థాయిని చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అంచనా వేశారు. ‘భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య వచ్చే ఏడాది తొలి మాసంలో గరిష్ఠానికి చేరుకోవచ్చు. అదే సమయంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినా ఆందోళన పడనక్కర లేదు. వైరస్ కట్టడి చర్యల ద్వారా మూడో వేవ్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు’ అని దేశంలో మహమ్మారి ప్రభావాన్ని గణితశాస్త్ర పరంగా అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తోన్న సూత్ర మోడల్‌ను రూపొందించిన మనీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. గతంలో డెల్టా ప్రభావం చూపించినప్పుడు మాదిరిగానే రాత్రిపూట కర్ఫూ, జనసమూహాలను నియంత్రించడం వంటి ఆంక్షల ద్వారా దీని తీవ్రతను నియంత్రించ వచ్చని సూచించారు. ఒమిక్రాన్‌కు సంక్రమణ సామర్ధం ఎక్కువగా ఉన్నప్పటికీ స్వల్ప్లలక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, అందువల్ల కేసులు పెరిగినప్పటికీ ఆస్పత్రుల చేరికలు మాత్రం తక్కువగా ఉండవచ్చని అంచనా వేశారు. దేశంలో థర్డ్ వేవ్ ఖాయమన్న ఆయన, అది ఏమేరకు ప్రభావాన్ని చూపుతుందనే విషయం ప్రభుత్వాలు తీసుకునే కట్టడి చర్యలపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.

3rd wave peak expected in Feb 2022: Kanpur IIT

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News