Monday, December 23, 2024

రాజీకి రాకుంటే మూడో ప్రపంచ యుద్ధమే..

- Advertisement -
- Advertisement -

జెరూసలెం ః ఇప్పటికైనా అంతా మేల్కొనకపోతే ఇజ్రాయెల్ గాజా యుద్ధం చిలికిచిలికి మూడో ప్రపంచ యుద్థానికి దారితీస్తుందని ఇజ్రాయెల్ రచయిత, చరిత్రకారుడు యువల్ నోహ్ హరారీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో ఉన్న ఘర్షణ క్రమేపీ కొన్ని దేశాలు చెరోవైపు చేరి ప్రాంతీయ స్థాయి వార్‌కు తరువాతి క్రమంలో పలు దేశాల చేరికతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఈ రచయిత తెలిపారు. కోవిడ్ , లాక్‌డౌన్లు తరువాతి క్రమంలో రష్యా ఉక్రెయిన్ వార్ వంటి పరిణామాలతో ప్రపంచ ఆర్థిక పరిస్థితి దెబ్బతిని ఉంది. అస్థిరత ఏర్పడింది. ఈ దశలో ప్రపంచ దేశాలు రెండు శిబిరాలుగా మారితే ఇక ఎంతకు సర్దుకోలేని తీవ్రస్థాయి గ్లోబల్ వార్‌కు దారితీస్తుందని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News