రిక్టర్ స్కేల్‌పై4.0గా నమోదు
బీహార్‌లోనూ భూప్రకంపనలు
అప్రమత్తంగా ఉండాలని
ప్రజలకు మోడీ సూచన
న్యూఢిల్లీ : ఉత్తరాదిన వరుస భూకంపాలు సంభవించాయి. సోమవారం తెల్లవారు జామున ఢిల్లీ , పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకోగా, ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధి లోనే బీహార్ రాష్ట్రంలో మ రోసారి భూకంపం సంభవించింది. మొ ద ట సోమవారం తెల్లవారు జామున 5.35 గంటల సమయంలో ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ , గాజియాబాద్ , నేషనల్ క్యాపిటల్ రీజియన్‌ఎన్‌సిఆర్ ప్రాంతాల్లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ధౌలాకాన్ లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలేజీ సమీపంలో 5 కిలో మీటర్ల లోతున భూకంపం చేంద్రం ఉన్నట్టు అధికారులు గురిచారు. ఢిల్లీలో కొన్ని సెకన్ల పాటు భూమి తీవ్రంగా కంపించడంతోపాటు భారీ శబ్దం వినిపించినట్టు కొందరు చెబుతున్నారు.
అపార్టుమెంట్లు, విద్యుత్ స్తంభాలు ఊగిపోయాయని పేర్కొన్నారు. దీంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలో భూంపం సంభవించిన గంటల వ్యవధి లోనే బీహార్ రాష్ట్రంలో మరో భూకంపం సంభవించింది. బీహార్ లోని సివాన్ జిల్లాలో సోమవారం ఉదయం 8.02 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రం 4.0 గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. సివాన్‌లో 10 కిమీ లోతున భూకంపం కేంద్రం ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా బీహార్ ప్రకృతి వైపరీత్య నిర్వహణ విభాగం అడిషనల్ చీఫ్ సెక్రటరీ ప్రత్యాయ అమృత్ ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టాలు జరిగినట్టు ఇంతవరకు సమాచారం లేదన్నారు.
అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మోడీ సూచన
దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ మళ్లీ ఢిల్లీలో ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రతా చర్యలు పాటించాలని కోరారు. భూ విజ్ఞాన శాఖ మంత్రి జితేంద్రసింగ్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు. జాగ్రత్తలు పాటిస్తూ సంసిద్ధంగా ఉండాలని కోరారు. ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఢిల్లీ పోలీసులు ఎమర్జెన్సీకి 112 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని ఎక్స్ పోస్టు ద్వారా ప్రజలకు తెలియజేశారు.