- Advertisement -
ముంబై: మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని కొల్హాపూర్‌లో సోమవారం తెల్లవారుజామున 2.36 గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.0గా నమోదైందని పేర్కొంది. కొల్హాపూర్‌కు 78 కిలోమీటర్ల దూరంలో భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు.
4.0 Magnitude of Earthquake hit Kolhapur in Maharashtra
- Advertisement -