Sunday, November 17, 2024

తొలిసారి 4 వేలకుపైగా మరణాలు

- Advertisement -
- Advertisement -

4.01 Lakh corona positive cases in India

 

4,01,078 కేసులు
4187 మరణాలు, డెత్‌రేట్ 1.09 శాతం
12 రాష్ట్రాల్లో 80 శాతంపైగా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో మొదటిసారి ఒక్క రోజులో 4 వేలకుపైగా మరణాలు సంభవించాయి. దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత ఇంత సంఖ్యలో మరణాలు ఇదే మొదటిసారన్నది గమనార్హం. శనివారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19 కేసులు 4,01,078,మరణాలు 4187 నమోదయ్యాయి. దీంతో,మొత్తం కేసుల సంఖ్య 2,18,92,676కి, మొత్తం మరణాల సంఖ్య 2,38,270కి చేరింది. కోలుకున్నవారి సంఖ్య1,79,30,960కి చేరింది. దీంతో, రికవరీ రేట్ 81.90 శాతంగా, మరణాల రేట్ 1.09 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 37,23,446గా నమోదైంది. మొత్తం కేసుల్లో ఇది 17.01 శాతం అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

12 రాష్ట్రాల్లోనే 80.68 శాతం యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. యాక్టివ్ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర (6.57 లక్షలు), కర్నాటక (5,36,661), కేరళ(4,02,997), ఉత్తర్‌ప్రదేశ్ (2,54,118),రాజస్థాన్ (1,99,147) ఉన్నాయి. 24 గంటల్లో మహారాష్ట్రలో54,022, కర్నాటకలో 48,781, కేరళలో 38,460, ఉత్తర్‌ప్రదేశ్‌లో 27,763, తమిళనాడులో 26,465, ఢిల్లీలో 19,832, బెంగాల్‌లో 19,216, రాజస్థాన్‌లో 18,231, ఆంధ్రప్రదేశ్‌లో 17,188, హర్యానాలో 13,867 కేసులు నమోదయ్యాయి.

శుక్రవారం 18,08,344 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో, మొత్తం పరీక్షల సంఖ్య 30,04,10,043కి చేరిందని ఐసిఎంఆర్ తెలిపింది. 24 గంటల్లో దేశంలో 4187 మరణాలు నమోదు కాగా, అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 898,కర్నాటకలో 592,ఉత్తర్‌ప్రదేశ్‌లో 372, ఢిల్లీలో 341, చత్తీస్‌గఢ్‌లో 208, తమిళనాడులో 197,పంజాబ్‌లో 165, రాజస్థాన్‌లో 164, హర్యానాలో 162,ఉత్తరాఖండ్‌లో 137, జార్ఖండ్‌లో 136, గుజరాత్‌లో 119,బెంగాల్‌లో 112 నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News