Wednesday, January 22, 2025

బాలకోటి రెడ్డిని చంపడానికి రూ.4.5 లక్షల డీల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: బాలకోటి రెడ్డి-వెంకటేశ్వర రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని ఎస్‌పి రవిశంకర్ రెడ్డి తెలిపారు. రొంపిచర్ల మండలం టిడిపి అధ్యక్షుడు బాలకోటి రెడ్డిపై ప్రత్యర్థులు కాల్పులు జరిగిన సందర్భంగా ఎస్‌పి మీడియాతో మాట్లాడారు. టిడిపి పార్టీలో అంతర్గత విభేదాలు కాల్పులకు కారణంగా మారాయని వివరించారు. ఎంపిటిసి పదవి ఇప్పిస్తానని వెంకటేశ్వర రెడ్డి వద్ద బాల కోటి రెడ్డి రూ.6.5 లక్షల తీసుకున్నాడని, బాలకోటి రెడ్డిని చంపటానికి రూ.4.5 లక్షల డీల్ జరిగిందన్నారు. రాజస్థాన్ నుంచి రూ.60 వేలకు గన్ కొన్నామని, బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి శివారెడ్డి పేరుతో డోర్ తట్టామని, డోర్ తీసిన వెంటనే బాలకోటి రెడ్డిపై కాల్పులు జరిపారని వివరించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు.

పల్నాడులో కాల్పుల కలకలం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News