Friday, December 27, 2024

హైదరాబాద్ లో నిన్న 4.5 లక్షల కేజీల చికెన్ స్వాహా

- Advertisement -
- Advertisement -

డిసెంబర్ 31 అంటేనే మందుబాబులూ, విందురాయుళ్లూ చెలరేగిపోతారు. బాటిళ్లకు బాటిళ్లే లేపేస్తారు. ఇక విందు గురించి చెప్పేదేముంది? ఆ రోజు చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు మరి. అందుకనే కాబోలు హైదరాబాద్ లోని మటన్, చికెన్ షాపులు ఆదివారంనాడు కిటకిటలాడిపోయాయి.

మామూలుగా హైదరాబాద్ లో ప్రతి రోజూ మూడు లక్షల కేజీల చికెన్ అమ్ముడుపోతుందని అంచనా. డిసెంబర్ 31 ఆదివారం కావడంతో కోడిమాంసానికి రెక్కలొచ్చాయి. నిన్న ఒక్క రోజే హైదరాబాద్ లో చికెన్ ప్రియులు 4.5 లక్షల కేజీల చికెన్ ను స్వాహా చేసినట్లు అంచనా. మటన్ కూడా బాగానే అమ్ముడుపోయిందట. సుమారు 25వేల క్వింటాళ్ల మటన్ అమ్ముడుపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News