Sunday, December 22, 2024

జపాన్ ను కుదిపేసిన భూకంపం

- Advertisement -
- Advertisement -

రిక్టర్ స్కేల్ పై 4.9 మ్యాగ్నిట్యూడ్ నమోదు

మియాగి, ఇబారకి, తోచిగి ప్రాంతాల్లో భూకంపనలు

టోక్యో: ఈశాన్య జపాన్ ప్రాంతం ఫుకుషిమాలో ఆదివారం 4.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. మధ్యాహ్నం 12:12 గంటలకు భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం 50 కి.మీ  లోతులో, ఫుకుషిమాలో జపనీస్ భూకంప తీవ్రత స్కేలు7పై 4గా నమోదైంది, అయితే సునామీ ముప్పు ఏమీ లేదని జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపింది.

భూకంప కేంద్రం 37.1 డిగ్రీల ఉత్తర అక్షాంశం, తూర్పు 141.2 డిగ్రీల రేఖాంశంలో ఉందని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. మియాగి, ఇబారకి , తోచిగి ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయి.

దైచి అణు విద్యుత్ ప్లాంట్ , ఫుకుషిమా డైనీ అణు విద్యుత్ ప్లాంట్‌లో కొత్త అసాధారణతలు ఏవీ నివేదించబడలేదని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ప్లాంట్ ఆపరేటర్ తెలిపాడు. ప్రస్తుతానికైతే  ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించే ఎలాంటి సమాచారం లేదు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News