Thursday, March 13, 2025

చిత్తూరులో కాల్పుల కలకలం..నలుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఎపిలోని చిత్తూరులో గాంధీరోడ్డులో కాల్పులు కలకలం రేపాయి. లక్ష్మీ సినిమా హల్ సమీపంలో ఉన్న పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. దుండుగులు రెండు తుపాకులతో కాల్పులు సైతం జరిపి ఇంట్లో వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే యజమాని అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. యజమాని నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. షాపింగ్ మాల్ యజమాని ఇంట్లో కాల్పులు జరిపిన ఘటనలో నలుగుర్ని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వ్యానులో నిందితుల్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రెండు తుపాకులు, కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ మణికంఠ చెందోలు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రశాంతంగా ఉండే చిత్తూరులో కాల్పులు జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. వ్యాపారి ఇంట్లోకి చొరబడిన నిందితులు గాల్లోకి కాల్పులు జరిపి వారిని బెదిరించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. అప్రమత్తమైన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.

పోలీసులు బెటాలియన్ తో దిగి ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. మరోవైపు కాల్పులు జరిగిన ఇంట్లోకి చాకచక్యంగా ప్రవేశించిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేయడానికి వచ్చారా, లేక హత్య చేసే కుట్ర జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికుల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో ఆ నలుగురిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాల్పులు జరిగాయని తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాల వారు సైతం గాంధీరోడ్డులోని లక్ష్మి సినిహా హాల్ వద్ద ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. కాసేపు అక్కడ సినిమా సీన్ లాంటి రియల్ సీన్లు కనిపించాయి. పోలీసులు, స్పెషల్ ఫోర్స్ బలగాలు సకాలంలో అక్కడికి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. కాల్పులు జరిగిన చుట్టుపక్కల ఇండ్ల వారిని సైతం పోలీసులు వివరాలు ఆరా తీశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, ఆయుధాలతో తిరుగుతున్నారని తెలిసినా తమకు సమాచారం అందివ్వాలని చిత్తూరు ఎస్పీ ప్రజలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News