Sunday, January 19, 2025

నర్సుపై సామూహిక అత్యాచారం కేసు.. నలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

నర్సుపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురి అరెస్టు
నిందితులు గురుగ్రామ్‌కు చెందిన స్విమ్మింగ్ ట్రెయినర్లు

బెంగళూరు: నర్సుపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌కు చెందిన నలుగురు స్విమ్మింగ్ ట్రెయినర్లు(ఈత శిక్షకులు) పోలీసులు అరెస్టు చేశారు. నిందితులలో ఒకడైన రజత్ సురేష్ 22 ఏళ్ల బాధితురాలితో ఒక డేటింగ్ యాప్‌లో పరిచయం పెంచుకుని మార్చి 24న ఆమెను ఒక హోటల్‌కు తీసుకెళ్లాడని పోలీసులు బుధవారం తెలిపారు. ఆ తర్వాత తన ముగ్గురు మిత్రులతో కలసి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపాడని వారు చెప్పారు. మిగిలిన ముగ్గురు నిందితులను యోగేష్ కుమార్, శివ్ రాణా, దేవ్ సరోహగా గుర్తించారు. నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారం జరిపి, చిత్రహింసలు పెట్టారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వెంటనే తన మిత్రులకు సమాచారం అందచేయగా వారు వచ్చి ఆమెను కాపాడారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం నలుగురిని అరెస్టు చేసి జుడిషియల్ కస్టడీకి అప్పగించారు. గురుగ్రామ్‌కు చెందిన రజత్ చాలాకాలంగా బెంగళూరులో నివసిస్తున్నాడు. మిగిలిన ముగ్గురు కొద్ది నెలల క్రితమే నగరానికి వచ్చి ఒక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్మింగ్ ట్రెయినర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు చెప్పారు.

4 Arrest for Gang Raping on Nurse in Bengaluru

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News