Sunday, January 26, 2025

ఎల్బినగర్ సంతోషిమాత ఆలయంలో చోరి కేసులో నలుగురు అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల నగరంలోని ఎల్ బి నగర్ సంతోషిమాత ఆలయంలో జరిగిన చోరి కేసును పోలీసులు చేధించారు.చోరీకి పాల్పడిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆలయంలో చోరి చేసిన 215 గ్రాముల బంగారం, రూ.19 లక్షల నగదు, ఒక కారు, బుల్లెట్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై తెలుగు రాష్ట్రాల్లో 10 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

4 Arrested after stolen gold in LB Nagar Santhoshi Matha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News