మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు యత్నించిన కేసులో మరో నలుగురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్‌కు సహకరించిన సంతోష్, సుగుణ, సురేందర్, సాగర్లను అరెస్టు చేసినట్లు వెస్ట్‌జోన్ డిసిపి జోయల్ డేవిస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసుకు సంబంధించిన వివరాలను డిసిపి మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్ ను ఈ నెల 6న అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించామన్నారు. ఈక్రమంలో నిందితుడు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని కీలక వివరాలు సేకరించామన్నారు.
నాంపల్లిలో ఎయిర్ పిస్టల్, మహారాష్ట్రలోని నాందేడ్లో కత్తి, బిహార్లో దేశవాళీ తుపాకీ కొనుగోలు చేసినట్లు గుర్తించామని, దేశవాళీ తుపాకీ, ఎయిర్ పిస్టల్ కొనుగోలు చేసేందుకు సంతోష్, సుగుణ. సురేందర్, సాగర్ కలిసి ప్రసాద్కు సహకరించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. బిహార్‌కు చెందిన మున్నా కుమార్ నుంచి రూ.60వేలకు ప్రసాద్ దేశవాళీ తుపాకీ కొనుగోలు చేశాడని, తుపాకీ విక్రయించిన మున్నా ప్రస్తుతం పరారీలో ఉన్నాడన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్‌ను పోలీసు కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని డిసిపి వెల్లడించారు.
4 Arrested in attempt murder case of MLA Jeevan Reddy