Friday, January 10, 2025

విషాద ఘటన.. రోడ్డు ప్రమాదంలో నలుగురు అన్నదమ్ముల మృతి..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు ఎరుకల కృష్ణ, ఎరుకల సంజీవ్, ఎరుకల సురేష్, ఎరుకల వాసులు బ్రతుకుదేరువు కోసం వెళ్లి సూరత్ లో స్థిరపడ్డారు. అయితే, స్వగ్రామం చౌటపల్లిలో తమ చిన్ననాన్న అంత్యక్రియలకు వచ్చి కారులో సూరత్ కు వెళ్తుండగా ఔరంగాబాద్ లో కారు ప్రమాదవశాత్తు పల్టీ కొట్టింది.ఈ ఘటనలో నలుగురు అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News