Wednesday, January 22, 2025

చాకొలెట్లు తిని నలుగురు బాలల మృతి.. విచారణకు ఆదేశం

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఖుషీ నగర్ జిల్లాలో బుధవారం విషపూరిత చాకొలెట్లను తిన్న నలుగురు బాలలు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మంజన(5), స్వీటీ (3), సమర్(2) తోబుట్టువులు. వీరితోపాటు అరుణ్(5) కూడా మరణించాడు కాశ్య ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనపై దర్యాప్తుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఆదేశించారు. ఖుషీనగర్ జిల్లా దిలీప్ నగర్‌లోని ముఖియా దేవి బుధవారం ఉదయం తన ఇంటిని శుభ్రం చేస్తుండగా, ఓ ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. దానిలో 5 చాకొలెట్లు, కొన్ని నాణేలు ఉన్నాయి. ఆ చాకొలెట్లను తన ముగ్గురు మనుమలకు, పొరుగింట్లో ఉన్న అరుణ్‌కు ఇచ్చారు. వాటిని తిన్న తర్వాత నలుగురు బాలలు స్పృహ కోల్పోయారు. జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మరణించారని వైద్యులు చెప్పారు.

4 Children Killed After Eating Chocolate in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News